ముంబై : దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు మహేంద్ర సింగ్ ధోనీ ఎంపిక కావడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రిషభ్ పంత్‌కే మరిన్ని అవకాశాలు ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 15న జరిగే తొలి టీ20కి అదే నెల 4న భారత జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ 18 (మొహాలి), సెప్టెంబర్ 22 (బెంగళూరు)న మ్యాచ్‌లు ఉంటాయి. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఆడిన జట్టునే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేస్తారని సమాచారం. 2020లో ప్రపంచ కప్పునకు పటిష్ఠ జట్టును రూపొందించేందుకు జట్టులో ఎక్కువ మార్పులు చేయకూడదని సెలక్షన్ కమిటీ భావనగా చెబుతున్నారు. ‘ప్రపంచకప్ మొదటి మ్యాచ్ ఆడేందుకు ముందు టీమిండియాకు కేవలం 22 టీ20లే ఉన్నాయి.