పట్టణాల్లోనూ మనదే హవా

పట్టణాల్లోనూ మనదే హవా

హైదరాబాద్‌ : మునిసిపల్‌ ఎన్నికల్లో కూడా తెరాస ఏకపక్ష విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తెరాస వైపే ఉన్నారని, ఇతర పార్టీలు ఎంత హడావుడి చేసినా పట్టించుకోవద్దని అన్నారు. ఇదే సందర్భంలో మునిసిపల్‌ ఎన్నికల కోసం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీల్లో ప్రస్తుతం పార్టీల బలాబలాలపై ఆరా తీశారు. ఇతర పార్టీల్లోని బలమైన నాయకులు, వారి సత్తా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos