లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. బుధవారం ఇక్కడ జరిగిన పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీనియర్ ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిపై పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఎస్పీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతానని, లక్ష్య సాధనలో తల వంచడం లేదా మడమ తిప్పడం చేయబోనని ఆమె ప్రతిజ్ఞ చేశారు.