ఆ టికెట్లు తెదేపా ముద్రించినవి

ఆ టికెట్లు తెదేపా ముద్రించినవి

అమరావతి : తిరుపతి-తిరుమల బస్సు టికెట్లపై క్రైస్తవ మత ప్రచారాన్ని చేయటంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస్ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఆ టిక్కెట్లు గత ప్రభుత్వ హయాంలో ముద్రితమైనవని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఆ టెండర్లను బాబు ప్రభు త్వం కట్టబెట్టిందని విమర్శించారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లు నిబంధనలకు విరుద్ధంగా తిరుపతి డిపోకు వెళ్లాయన్నారు. బాధ్యులపై చర్య లకు ఆదేశించామన్నారు. ఇదంతా తేదేపా రాజకీయ నాటకమని అభివర్ణించారు. హిందుత్వానికి వ్యతిరేకకంగా చంద్రబాబు నాయుడు చేయని అరా చ కాలు లేవన్నారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం నుంచి బంగారాన్ని లారీల్లో తరలించడం వంటి దుర్మార్గాలు చేశారని ఆరోపించారు. అందుకే ఆ దేవుడి ఆగ్రహానికి గురయ్యారని, మతాలన్నీ ఛీ కొట్టినందునే చంద్రబాబు అందరికీ దూరమయ్యారని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos