శ్రీనగర్: రాజధాని శ్రీనగర్లో శుక్రవారం మరోసారి ఆంక్షలు విధించారు. జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకి వ్యతిరేకంగా కొన్ని వేర్పాటువాద సంస్థలు ఆందో ళనకు పిలుపునివ్వడం ఇందుకు కారణం. గురువారం రాత్రి నగరంలో పలుచోట్ల ఆందోళనకు పిలుపు నిచ్చిన పత్రాలు గోడలపై వెలి శాయి. దీంతో ఎక్కడికక్కడ బారీకేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు లేనందున ప్రజలు గుంపులు గుంపులుగా తిరగొద్దని పోలీసులు విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా విధించిన ఆంక్షల్ని ఈ వారమే దశల వారీగా తొలిగించారు. అయితే ప్రముఖ నేతల్ని ఇంకా నిర్బంధంలోనే ఉంచారు..