హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్స సత్య నారాయణకు హైద్రాబాద్ సీబీఐ కోర్టు తాఖీదుల్ని జారీ చేసింది. వచ్చే నెల 12 వ తేదీన హాజరుకావాలని సూచించింది. . ఉమ్మడి రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ పరిశ్రమల మంత్రిగా ఉన్నపుడు వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ స్థాపనలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.