రాజ్యసభకు మన్మోహన్‌ సింగ్‌

రాజ్యసభకు  మన్మోహన్‌ సింగ్‌

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడుగా శుక్రవారం ఛైర్మన్ వెంకయ్య నాయుడు సమక్షంలో ప్రమాణం చేశారు. మన్మోహన్ రాజస్థాన్ శాసనసభ నుంచి రాజ్యసభకు నామ పత్రాన్ని దాఖలు చేసారు. గడువులోగా ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరూ నామ పత్రాల్ని దాఖలు చేయక పోవటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మన్మోహన్ ప్రమాణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గులామ్ నబీ అజాద్ తదితర సీనియర్ నేతలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. భాజపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు మదన్లాల్ సైనీ అకాల మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. 2024 ఏప్రిల్ 3 వరకూ ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఉంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos