అమరావతి: రైతులను మోసం చేసి వారి నుంచి వేల ఎకరాల భూములు అతి తక్కువ ధరలకు కొన్నవారే ఇప్పుడు రాజధాని ని తరలించ వద్దని గొంతు చించుకుంటున్నారని శుక్రవారం వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపునకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్ర బాబు నాయుడు, సుజనా చైదరి, కేశినేని, సీఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, ‘కావాల్సిన’ వాళ్లు.. రైతులను మోసం చేసి వారి వద్ద నుంచి వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. స్థిరాస్తి ధరలు పడిపోతాయన్నదే వారి ఏడుపు’అని విమర్శించారు.