న్యూఢిల్లీ: ముమ్మారు తలాక్ను నేరంగా పరిగణించిన కొత్త చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వం లోని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వెల్లడించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్ర వారం విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి తాఖీ దుల్ని జారీ చేసింది. ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం-2019 రాజ్యాంగం, దాని నిబంధనలకు వ్యతిరేకమైనదని కొందరు అత్యు న్నత న్యాయస్థానంలో వ్యాజ్యాల్ని దాఖలు చేసారు. తలాక్ను శిక్షార్హమైన నేరంగా పరిగణించే అంశాన్ని పరిశీలించాలని కోరారు.