న్యూఢిల్లీ : దేశీయ ఆటో పరిశ్రమకు శుభవార్త. ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడికి ఎలాంటి గడువు లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదా రుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. ఇ-వాహనాల పరివర్తన సహజంగా జరుగుతుందన్నారు. గత 19 ఏళ్లలో ఎన్న డూ లేని విధంగా విక్రయాలు పడి పోయిన వాహన రంగానికి గడ్కరీ ప్రకటన ఊరట. 2023 నుంచి 150 సీసీ లోపు ద్వి చక్ర వాహనాలు, 2025 నాటికి త్రి చక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహ నాలుగా పూర్తిగా మారాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీనిపై గురు వారం ఇక్కడ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు స్పందించారు. ‘పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్ధిష్ట గడువులోగా నిషేధించాలనే ప్రతిపాదన ఏదీ లేదు. సంబంధిత వర్గాలను సంప్ర దించిన తరువాతే దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకుంటా మ’న్నారు.