నారావారి ప‌ల్లెలో సంక్రాంతి సంబ‌రాలు

నారావారి ప‌ల్లెలో సంక్రాంతి సంబ‌రాలు

భోగి పండుగ నాడు తెలుగు ప్ర‌జ‌లంతా వేడుక‌ల్లో మునిగిపోయారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంత గ్రామం నారావారి ప‌ల్లెలో భోగి వేడుక‌ల్లో కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. ప్ర‌తీ ఏటా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నారా వారి ప‌ల్లెలో సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఇదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్నారు.
మొద‌లైన సంక్రాంతి సంబ‌రాలు..
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వ‌గ్రామం నారావారి పల్లెలో సంక్రాంతి సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌తీ ఏటా చంద్ర‌బా బు సంక్రాంతి వేడుక‌లు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నారావారి ప‌ల్లెలో జ‌రుపుకోవ‌టం ఆన‌వాయితీ. ఈ సారి కూడా అదే విధంగా నారావారి ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యులు భోగి వేడుల్లో నిర్వ‌హించారు. భోగి వేడుకల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి కుమారుడు దేవాన్ష్ పాల్గొన్నారు. తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు.
భువనేశ్వరి, బ్రహ్మణి ఆధ్వర్యంలో..
ఆదివారం ఉదయం సీఎం సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి ఆధ్వర్యంలో మహిళలు, యువతీ యువకులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందచేశారు. ఇరుగుపొరుగు గ్రా మాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొని సందడి చేశా రు. సంప్రదాయ వంటకాలతో ఫుడ్‌ఫెస్ట్‌ నిర్వహించగా, భువనేశ్వరి తన మనవడు దేవాన్ష్‌కు వాటిని తినిపించి, వంటకాలను ప్రశంసించారు.
సంబ‌రాల కోసం ముఖ్య‌మంత్రి..
త‌న సొంత గ్రామం నారావారి ప‌ల్లె లో సంక్రాంతి సంబ‌రాల్లో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు. సంక్రాంతి పర్వదినాన్ని ఆయన కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తుల మధ్య జరుపుకోనున్నారు. ఉదయం 8.45కి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకొనున్న చంద్రబాబు… అనంతరం 11.30గంటలకు కాశిపెంట్లలోగల హెరిటేజ్ పరిశ్రమలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత 12గంటలకు నారావారిపల్లెకు చేరుకోనున్నారు. రెండురోజులపాటు చంద్రబాబు అక్కడే ఉంటారు. గ‌త కొన్నేళ్లుగా సంప్ర‌దాయ బ‌ద్దంగా నిర్వ‌హిస్తున్న సంబ‌రాల్లో ముఖ్య‌మంత్రి పాల్గొన టం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌టంతో కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రికి శుభాకాంక్ష‌లు చెప్ప‌టం తో పాటుగా రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను సీయం కు వివ‌రించే అవ‌కాశం ఉంది. దీంతో.. ఈ సారి సంక్రాంతి సంబ‌రాల‌కు ప్ర‌త్యేక‌త ఏర్ప‌డింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos