ఢిల్లీ : దేశ రాజధానిలో దుండగులు బరితెగించారు. ఏకంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా భార్య అపర్ణ మెహతాపై దాడి చేశారు. మండీ హౌస్ సమీపంలో ఆదివారం రాత్రి ఫిక్కీ ఆడిటోరియం వద్ద ఆమెపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె వద్ద నుంచి మొబైల్ ఫోనును లాక్కుని పరారయ్యారు. ఈ హఠాత్సంఘటనతో ఆందోళనకు గురైన ఆమె సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.