భారత జట్టుకు ఉగ్ర ముప్పు

  • In Sports
  • August 19, 2019
  • 203 Views
భారత జట్టుకు ఉగ్ర ముప్పు

కూలిడ్జ్‌ : వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత క్రికెట్‌ జట్టుకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ వచ్చిన మెయిల్‌ కలకలం సృష్టించింది. బీసీసీఐకి వచ్చిన ఈ మెయిల్‌ ఉత్తుత్తిదేనని తేలినా, జట్టుకు పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై ఆంటిగ్వాలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని రాయబార కార్యాలయం అప్రమత్తం చేసిందని, భారత ఆటగాళ్లకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని వివరించారు. అవసరమైతే మరింత భద్రత పెంచుతారని చెప్పారు. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా, కూలిడ్జ్‌లో మూడు రోజుల మ్యాచ్‌ ఆడుతోంది. సోమవారం ఈ మ్యాచ్‌ ముగియనుంది. ఈ నెల 22 నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos