అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పై డ్రోన్ ఎగరేయటాన్ని సవాలు చేస్తూ న్యాయ స్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నట్లు తెదేపా నేత అచ్చన్నాయుడు సోమవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ప్రయివేట్ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డినీ నిందితుడుగా పేర్కొంటామని చెప్పారు. డ్రోన్ తో పట్టుబడిన వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దాఖలు చేస్తామని వివరించారు.దీని గురించి పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్, గవర్నర్ బిశ్వభూషణ్కూ ఫిర్యాదు చేసారు