యుద్ధానికి సిద్ధం

యుద్ధానికి సిద్ధం

ఇస్లామా బాద్ : కశ్మీర్ స్వాతంత్య్ర సాధనకు భారత్తో యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం హెచ్చ రించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించిన ఆయన భారత ప్రభుత్వంపై ధ్వజ మెత్తారు. ‘నరేంద్ర మోదీ తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఇందుకు తప్పక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు. భాజపా మాతృ సంస్థ సంఘ పరివార్ ముస్లింల పై మూక దాడులను ప్రోత్సహి స్తోందని ఆరోపించారు.‘ కశ్మీర్లో పౌరులపై జరుగుతున్న దాడులు, అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా పడుతున్న కష్టాల గురించి మేము చింతి స్తున్నాం. భారత ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదం చేసింది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజం మాట్లాడకపోవచ్చు. కశ్మీరీల తరఫున నేను మాట్లాడతాను. అన్ని వేదికలపై కశ్మీర్కు ప్రచార కర్తగా ఉంటాను.దీని గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడాను. ఇస్లామిక్ దేశాలతో కూడా చర్చిస్తా’ నన్నారు. ‘భారత్లో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలి స్తున్నాం. పాక్ సైన్యం, ప్రజలు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనలను ఎంత మాత్రం సహించబోము. భారత్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామ’ని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos