ఔరా…సైరా

  • In Film
  • August 14, 2019
  • 127 Views
ఔరా…సైరా

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా చిత్రీకరణ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. సెట్‌లో జరిగిన సంఘటనలను ఇందులో వీక్షించవచ్చు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ  ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధృవ ఫేం సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, తమన్నా, అనుష్క, నయనతార, జగపతి బాబు, సుదీప్‌లు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos