శ్రీనగర్: జమ్ము ప్రాంతంలో పూర్తిగా ఆంక్షల్ని ఎత్తి వేసినట్లు జమ్ము-కశ్మీర్ అదనపు డీజీపీ మునీర్ ఖాన్ బుధ వారం ఇక్కడ తెలిపారు. కశ్మీర్లో మాత్రం మరి కొన్ని రోజుల పాటు ఆంక్షల్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. శ్రీనగర్, మరి కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నా ఎవరూ తీవ్రంగా గాయ పడలేదన్నారు. గాయ పడిన వారికి వెంటనే చికిత్స అందిం చామని తెలిపారు. సామాన్యులకు ఎటువంటి హాని కలగరాదనే లక్ష్యంతోనే ఆంక్షలు విధించామని వివరించారు. అనేక మంది ఇక్కడి శాంతి భద్రతలపై వదంతులను ప్రచారం చేసేందుకు 2016, 2010 ఉద్రిక్త పరిస్థితుల వీడియోలు, చిత్రాలను విడుదల చేసారని చెప్పారు. ఆ అబద్ధపు ప్రచా రాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. నకిలీ వార్తల్ని నియంత్రించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.