వన్డే సిరీస్‌లో భారత్ ఆధిక్యత

  • In Sports
  • August 12, 2019
  • 187 Views
వన్డే సిరీస్‌లో భారత్ ఆధిక్యత

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ : వెస్టిండీస్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కోహ్లీ, బౌలింగ్‌లో భువనేశ్వర కుమార్‌ చెలరేగడంతో భారత్‌ సునాయాసంగా విజయం సాధించింది. కోహ్లీ 125 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 120 పరుగులు చేశాడు. భువనేశ్వర్‌ 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. తొలుత బ్యాట్‌ చేసిన ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ 71 పరుగులు చేయడం ద్వారా కెప్టెన్‌కు చక్కటి సహకారన్నందించాడు.  తర్వాత వర్షం కారణంగా విండీస్‌ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులుగా నిర్ణయించారు. భారత బౌలర్ల ధాటికి 42 ఓవర్లలో 210  పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ లూయిస్‌ 65, పూరన్‌ 42 మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో షమి 2/39, కుల్దీప్‌ 2/59 రాణించారు. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఈ నెల 14న మూడో వన్డే జరుగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos