శ్రీనగర్:ఇక్కడి హరినివాస్లో బంధీలుగా ఉన్న మాజీ ముఖ్య మంత్రులు ఒబర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తిల్ని ల్లో అబ్ధుల్లాను ఆటవి శాఖ అతిథి గృహానికి తరలించారు. ఇద్దరి మధ్య కలాహాలే ఇందుకు కారణమని సమాచారం. జమ్ము్-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని పార్లమెంటు రద్దు చేయటానికి ముందు వారిని కేంద్రం బంధించింది. శిష్టాచారం ప్రకారం హరి నివాస్లోని కింది వాటాలో ఒమర్, మొదటి అంతస్తులో మెహబూబా నివశిస్తున్నారు. అక్కడే వారిని నిర్బంధించారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్యుద్ధం పెరిగింది. జమ్మూ-కశ్మీర్కు బీజేపీని తీసుకువచ్చింది మీరంటే,మీదరని ఇద్దరూ తగవులాడారు. 2015-2018 మధ్య దివంగత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భాజపాతో పొత్తు పెట్టుకోవడాన్ని ఒమర్ తప్పు పట్టి మెహ బూబాపై కేకలు వేశారు. వారి గొడవ హరి నివాస్ సిబ్బంది చెవిన కూడా పడింది. ఒమర్ రెచ్చిపోయినపుడు దానికి దీటుగా మెహబూబా కూడా స్పందించారు. ‘అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మీ (ఒమర్) తండ్రి ఫరూక్ అబ్దుల్లా భాజపాతో పొత్తు పెట్టుకుని విదేశాంగ శాఖ సహాయ మంత్రి గా ఉన్నార’ని గుర్తుచేశారు. 1947లో ఇండియాలో జమ్మూ-కశ్మీర్ కలవడానికి ఒమర్ తాతగారైన షేక్ అబ్దుల్లా పాత్ర కూడా ఉందని దెప్పి పొడి చారు. ఇలా ఒమర్-మెహబూబా మధ్య మాటామాటా పెరగడం గ్రహించిన జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఒమర్ను అక్కడి నుంచి అటవీ శాఖ నిర్వహణలో ఉన్న ‘స్ప్లెండిడ్ హట్’కు తరలించింది. మెహబూబా మాత్రం హరి నివాస్లో ఉండి పోయారు.