బీజేపీ పార్టీలో చేరడం ద్వారా మరో క్రీడాకారిణి రాజకీయాల్లో అడుగుపెట్టారు.ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి బబితా కుమారి ఫోగట్ తన తండ్రి మహవీర్ సింగ్ ఫోగట్‌తో కలసి సోమవారం ఢిల్లీలోని హర్యాణ భవన్లో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా ఇటీవల కశ్మీరీ అమ్మాయిలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలను బబిత సమర్థించారు. ఖట్టర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదని, సీఎం వ్యాఖ్యలను వక్రీకరించొద్దంటూ మీడియాకు సూచనలు చేశారు.అంతకుముందు మహవీర్ పొగట్ మాట్లాడుతూ.. ‘జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసి భాజపా ప్రభుత్వం చాలా గొప్ప పని చేసింది. మనోహర్‌లాల్ నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వం కూడా చాలా పారదర్శకంగా పనిచేస్తోంది. ఈ రోజు నేను, బబిత దిల్లీకి వెళ్తున్నాం’ అని మీడియాకు తెలిపారు.కాగా ప్రస్తుతం హర్యాణలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బబిత ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి బీజేపీలో చేరడం గమనార్హం.బీజేపీలో చేరిన అనంతరం ఇరువురు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.