బల్లియా: ఎస్సీ, ఎస్టీల పై అత్యాచార నిరోధక చట్టం, రిజర్వేషన్ల వల్లే సమాజంలో కులతత్వం సజీవంగా ఉందని ఉత్తరప్రదేశ్లోని బల్లియా భాజపా శాసనసభ్యుడు సోమ వారం ఇక్కడ వ్యాఖ్యా నించారు. ‘ఇవాళ కులతత్వం అనేది సజీవంగా ఉందంటే అందుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తగల చట్టమే కారణం. ఈ చట్టాన్ని రద్దు చేస్తే అంటరానితనమనేదే ఉండదు. ఎస్సీ, ఎస్టీ చట్టం, రిజర్వేషన్లు కులతత్వాన్ని సజీవం చేస్తున్నాయ’ని ఒక ప్రకటనలో తెలిపారు. సురేంద్ర సింగ్ గతంలోనూ చేసిన పలు వ్యాఖ్యాలు వివాదాస్పదమయ్యాయి. ముస్లింలు, క్రైస్తవుల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సిద్ధాంతాలు ప్రమాదంలో పడుతున్నామయని గత నెల 30న వ్యాఖ్యా నించారు. అంతకుముందు, ఒకరు కంటే ఎక్కువ మంది భార్యలు, ఇబ్బడిముబ్బడిగా పిల్లలున్న ముస్లింలను జంతు ప్రవృత్తి కలిగిన వారని అభివర్ణించారు. హిందుత్వం చెక్కుచెదరకుండా ఉండాలంటే ప్రతి హిందూ జంట కనీసం ఐదుగురు పిల్లల్ని కనాలని నిరుడు జులై ఉపదేశం చేసారు.