విద్యుత్ చౌర్యానికి వింత శిక్ష..

విద్యుత్ చౌర్యానికి వింత శిక్ష..

విద్యుత్‌ చౌర్యానికి పాల్పడ్డాడనే కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఓ వ్యాపారికి విచిత్రమైన శిక్ష విధించడం చర్చనీయాంశమైంది.ఢిల్లీలోని ఓ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తన దుకాణం నుంచి సమీపంలోని విద్యుత్‌ స్తంభానికి వైరు సెట్ చేసి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడ్డాడు.ఇది గమనించిన ఎలక్ట్రిసిటీ అధికారులు కరెంటు చోరీ చేస్తున్నాడని వ్యాపారిపై కేసు పెట్టారు. దీంతో కరెంటు డిపార్ట్మెంట్ రూ.18,267 రూపాయలు చెల్లించాలని కోరింది. అలాంటిదేమీ లేదన్న అతనుకోర్టులో కేసు దర్త్యాప్తును నిలిపివేయాలని కోరాడు. కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఇలాంటి కేసులో దర్యాప్తు కొనసాగించడం వల్ల కలిసొచ్చేది పెద్దగా ఏమీ ఉండదని భావించి వ్యాపారికి 50 మొక్కలు నాటాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.అయితే ఆ తీర్పులో కొన్ని షరతులు కూడా విధించింది.నెలరోజుల్లో మొక్కలు పాతాలనీ, పశ్చిమ అటవీశాఖ డిప్యూటీ కన్సర్వేటర్, సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్లో ఎక్కడ మొక్కలు పాతమంటే అక్కడ పాతాలని ఆదేశించింది. అంతేకాదు ప్రతీ మొక్క వయసూ 3 నుంచీ 3న్నర ఏళ్లకుపైగా ఉండాలనీ, మొక్క ఎత్తు దాదాపు 6 అడుగులు ఉండాలని పేర్కొంది.అంతే కాకుండా మొక్కలు నాటాలో డిప్యూటీ కన్సర్వేటర్ చెబుతారని జస్టిస్ ఆదేశమిచ్చారు. గులార్, కదంబ, పిల్ఖాన్, జామూన్, మర్రి, మామిడి, అమల్టాస్, మహువా, పుత్రంజివా, బాధ్, సంగ్వాన్, సఫెద్ సిరిస్, కాలా సిరిస్, అంజీర్, కథల్, జాక్ఫ్రూట్, పలాష్ అర్నీ, బిస్తెందు, రొహిందా, మెడ్షింగీ జాతి మొక్కల్ని నాటాలని హైకోర్టు ఆదేశించింది.అంతే కాకుండా మొక్కల్లో ఒక్కటి తగ్గినా తిరిగి చోరీ కేసు విచారణ మొదలవుతుందని స్పష్టం చేసింది. మొక్కలు నాటాక వాటిని ఫొటోలు తీసి, పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని డిప్యూటీ కన్సర్వేటర్ను కోర్టు కోరింది. ఆరు నెలలపాటూ మొక్కల్ని పెంచాలనీ, తర్వాత వాటిని ఫొటోలు తీసి మరో రిపోర్ట్ ఇవ్వాలని క్లారిటీగా చెప్పింది.అందుకు అంగీకరిస్తే చోరీ కేసు విచారణను రద్దు చేస్తామని ప్రకటించింది.కోర్టు విధించిన శిక్ష ముఖ్యంగా కోర్టు పెట్టిన షరతులు చూసి జడుసుకున్న వ్యాపారి ఈ శిక్ష కంటే ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లిండమే నయమని భావించి మొత్తం బిల్లు చెల్లించాడు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos