చెన్నై: కశ్మీర్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నందునే ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతి పత్తిని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రద్దు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం పోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు.’కండబలం’తో 370 అధికరణను రద్దు చేసిన వారికి చరిత్ర గురించి తెలియదు. ప్రత్యేక హోదా రద్దు నిర్ణయానికి ఏడు పార్టీలు మద్దతివ్వడం బాధ కలిగించింది. జమ్మూ-కశ్మీర్ భారత్లో అంతర్భాగం. ఇందులో సందేహం లేదు. ఒకవేళ అనుమానం అంటూ ఉంటే అది భాజపాకే ఉండాలి. కండ బలంతో ఆ పని చేసిన (370 రద్దు) వారికి 72 ఏళ్ల చరిత్ర గురించి తెలియదు’ అ ధ్వజమెత్తారు. ‘కశ్మీర్ కేవలం ముస్లిం ఆధిపత్యం ఉన్న ప్రాతం కావడంతోనే భాజపా ఆ అధికరణను రద్దు చేసింది. కశ్మీర్లో హిందువుల మెజారిటీ ఉండి ఉంటే ఆ జోలికే వెళ్లేది కాదు. తమిళనాడు రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాతంగా మారిస్తే తమిళ ప్రజలు మౌనంగా చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.