గర్భిణీని ఇలా రక్షించారు…

గర్భిణీని ఇలా రక్షించారు…

తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. ముంపు వాసులను రక్షించడం సహాయక బృందాలకు కత్తి మీద సాములా తయారైంది. భవాని నది తీరంలో ఉన్న ఓ కుటుంబాన్ని రక్షించడానికి ఈ బృందం పెద్ద సాహసమే చేసింది. ఆ ఇంట్లో ఇద్దరు వృద్ధులు, ఎనిమిది నెలల గర్భిణీ, ఒకటిన్నరేళ్ల చిన్నారి ఉన్నారు. వృద్ధులను క్షేమంగానే నదిని దాటించగలిగారు. గర్భిణీని, ఆమె కుమారుని నది దాటించడం పెద్ద సవాలుగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాళ్లు, బెల్టు సాయంతో గర్భిణీని వేళ్లాడదీసి, నదిని దాటించారు. సహాయక బృంద సభ్యుడొకరిని అలాగే కట్టి, అతని ఒడిలో బాలుని కూర్చుండబెట్టి నది ఆవలకు చేర్చారు. దీనికి సంబంధించిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో తెగ సంచరిస్తోంది. సహాయక బృందం సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos