ముంబై : దేశ సరిహద్దులను కాపాడాల్సిన వీర జవాను తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ మహిళను వరద నీటి ముప్పు నుంచి తప్పించాడు. దీనికి కృతజ్ఞతగా ఆమె అతనికి పాదాభివందనం చేసింది. మహారాష్ట్రలోని సంగ్లీలో ఈ సంఘటన జరిగింది. వరద పీడిత ప్రాంతం నుంచి కొందరు మహిళలను బోట్ ద్వారా జవాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మార్గమధ్యంలో ఓ మహిళ తన పక్కనే నిలబడ్డ జవాను పాదాలను తాకి ధన్యవాదాలు తెలిపింది. కొంత సేపటికి బోటులోని మరో జవాను కాళ్లకు కూడా మొక్కింది. నీరజ్ రాజ్పుత్ అనే జర్నలిస్టు శనివారం ఉదయం ఈ వీడియోను పోస్టు చేసింది.
Heart warming video from #sangli where a woman pays gratitude by touching soldiers' feets for rescuing them#Floods2019 #FloodSangli @adgpi pic.twitter.com/FIp7nTXyao
— Neeraj Rajput (@neeraj_rajput) August 10, 2019