ఖట్టర్ వ్యాఖ్యలు పరివార్‌ లక్షణాలు

ఖట్టర్ వ్యాఖ్యలు పరివార్‌ లక్షణాలు

న్యూఢిల్లీ: కశ్మీరీ అమ్మాయిల గురించి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ భావ జాలానికి అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రతి స్పందించారు. ‘కశ్మీర్ యువతుల పై ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. బలహీన మనస్కుడు, అభద్రతతో కూడిన వ్యక్తికి ఏళ్లకు ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన శిక్షణకు ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మగాళ్లు సొంతం చేసుకోవడానికి మహిళలేమి ఆస్తులు కాద’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తి ర ద్దు కావటంతో కశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గు చూపుతార’ని మనోహర్లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos