22 సంస్థల భూ కేటాయింపులు రద్దు

22 సంస్థల భూ కేటాయింపులు రద్దు

విజయవాడ: ఇక్కడకు సమీపంలోని వీరపనేని గూడెం పారిశ్రామిక వాడలో ఇప్పటి వరకూ పనులు చేపట్టని 22 సంస్థల భూ కేటాయింపుల్ని ప్రభుత్వం శనివారం రద్దు చేసింది. ఆదేశించారు. పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం కారు చౌకగా భూముల్ని ఆయా సంస్థలకు విక్రయిం చింది. నిర్మాణ పనులు ప్రారంభించ పోవటానికి గల కారణాల్ని తెలపాలని ప్రభుత్వం జారీ చేసిన తాఖీదులకు స్పందించక పోవటతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ అధికారులు తెలిపారు. ఎకరం భూమిని అప్పటి ప్రభుత్వం ఆ సంస్థలకు రూ.16.50 లక్షలకే కేటాయించింది. కేటాయింపులు జరిగిన ఆరు మాసాల్లో పనులు ప్రారంభించి, రెండేళ్ళలో ఉత్పాదకతను ఆరంభించాలి. ఇప్పటి వరకు 22 పారిశ్రామిక సంస్థలు ఎలాంటి పనులు చేపట్టలేదు. ఆ వాడలో రూ.30కోట్ల వ్యయంతో రోడ్లు, మురుగు నీరు. నీరు. విద్యుత్ తదితర మౌలిక వస తుల్ని కల్పించారు. తేట టేబుల్ , అను పార్టనర్స్, రత్న ఇండోర్ అండ్ ఫేపకేడ్, ఏపీ పార్టనర్స్, మిత్రా సోలార్, శ్రీ వంశీ ఇంజనీరింగ్ వర్క్స్, అక్షయ సోలార్ పవర్ ఇండియా, , రెయిన్బో, అక్షర టెక్నాలజీస్, స్వాతి ఇంజనీరింగ్, హిమశ్రీ ఇంజనీర్స్, మెడిక్విక్ సర్వీసెస్, ఎస్వీ టెక్నాలజీస్, నాగసాయి ప్రెసిషన్, జాహ్నవి ఇండియా, ప్రెసిషన్ మెటల్ టెక్నాలజీస్, ప్రసాద్ ఎంటర్ ప్రైజెస్, ఈకో ఆర్గానిక్స్ ల్యాబ్స్, మిత్రో ఇంజనీరింగ్ , శ్రీ విజయ ప్రెసిషన్స్ టెక్నా లజీస్, వెన్సే లైట్ మెటల్స్, విభ్రాంత్ టెక్నాలజీస్ సంస్థల భూ కేటాయింపులు రద్దయాయ్యయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos