అల్ల కల్లోలమైన కేరళ

అల్ల కల్లోలమైన కేరళ

తిరువనంతపురం: ప్రకృతి అందాలకు నెలవైన కేరళ వరుణుడి కోపంతో అల్ల కల్లోలమైంది. జల దిగ్బంధంతో జన జీవనం స్తంభించింది. నిరుడూ ఇదే దుస్థితిని సంభవించింది. క్రమంగా కోలుకుంటున్న దశలో మళ్లీ కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి రాష్ట్రం వణికిపోతోంది. ఒక వైపు కొండచరియలు విరిగి పడుతుండగా మరో వైపు జలాశయాలు నిండు కుండల్లా ఉప్పొంగుతున్నాయి. వానలు, వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య శనివారానికి 42 కు చేరింది. ఉత్తర కేరళలోని వయనాడ్, మలప్పురంలో పరిస్థితి విషాదంగా ఉంది. వయనాడ్లో కొన్ని చోట్ల గత 24 గంటల్లో 40 సెం.మీ. వర్ష పాతం నమోదైంది. తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు. వయనాడ్, మలప్పురం జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం కొండ చరియలు విరిగి పడ్డాయి శిథిలాల కింద నుంచి ముగ్గురి మృత దేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో అక్కడ సహాయక చర్యలను నిలిపివేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos