ఉద్యోగం పేరుతో వ్యభిచార ముఠా చేతిలో నాలుగు నెలలుగా నరకం చూస్తున్న ఓ యువతికి విటుడు రూపంలో దేవుడిలా దారి చూపించాడు. కోల్కతాకు చెందిన యువతి(27)ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది.అయితే ఉద్యోగంలో వచ్చే వేతనం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో ఉద్యోగాన్వేషణ చేస్తుండగా ఢిల్లీకి చెందిన మహిళతో ఏర్పడ్డ పరిచయం యువతి పాలిట శాపంగా పరిణమించింది.ఉద్యోగం పేరుతో యువతిని ఢిల్లీకి తీసుకెళ్లి నిర్బంధించి యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించారు.ఇలా నాలుగు నెలలు నరకం చూసిన యువతికి కొద్ది రోజుల క్రితం విటుడుగా వచ్చిన కోల్కతాకు చెందిన వ్యక్తి యువతి గాథ గురించి తెలుసుకొని రక్షించడానికి నిర్ణయించుకున్నాడు.వెంటనే యువతి సోదరుడికి విషయాన్ని తెలపడంతో ఢిల్లీకి చేరుకున్న యువతి సోదరుడు సోదరిని చూసి చలించిపోయాడు. బయటకు వచ్చి ఢిల్లీ మహిళా కమిషన్కు సమాచారం ఇచ్చాడు. కేసు ఫిర్యాదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు పథకం ప్రకారం దాడి చేసి వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. బందీగా ఉన్న మహిళకు విముక్తి కల్పించారు.