చండిగడ్: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు కావటంతో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప దమయ్యాయి. ఇప్పుడు సర్వత్రా అదే చర్చనీయాంశం. ‘మా మంత్రి ఓపీ ధన్ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చెప్పేవారు. ఇప్పుడు కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేందుకు మార్గం సుగమమైంద’ని చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఖత్తర్‌కు ఇది తొలిసారి కాదు. ‘యువతీ యువకుల మధ్య పరస్పర అంగీకారంతో అవి జరుగుతాయి. వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత తనపై అత్యాచారం జరిగిందని అమ్మాయిలు కేసులు పెడతారు. దాదాపు 80-90 శాతం కేసుల్లో ఇదే జరుగుతుంద’ని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నిలేపాయి. భాజపా శాసనసభ్యుడు విక్రమ్ శైనీ కూడా కశ్మీర్ యువతుల గురించి చేసిన వ్యాఖ్యలూ విమర్శలకు గురయ్యాయి.370 అధికరణ రద్దు కావడంతో ఇకపై తెల్లని కశ్మీరీ అమ్మాయిలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడవచ్చు. భాజపాలోని అవివాహిత నాయకులు కశ్మీర్ వెళ్లి ప్లాట్లు కొనుక్కుని పెళ్లిళ్లు చేసుకోవచ్చ’నీ ఉపదేశించారు.