ఢిల్లీ : భారత క్రికెటర్లు ఇకమీదట జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) పరిధిలోకి రానున్నారు. తద్వారా క్రికెటర్లకు నాడా డోప్ టెస్టులను నిర్వహిస్తుందని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించిందని వెల్లడించింది. క్రికెటర్లకు డోప్ టెస్టుల నిర్వహణకు నాడాకు అధికారం లేదని గతంలో బీసీసీఐ వ్యతిరేకించింది. అయితే బీసీసీఐకి వేరే మార్గం లేదని క్రీడా మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. దీంతో బీసీసీఐ దిగిరాక తప్పలేదు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ కూడా బీసీసీఐ నాడా పరిధిలోకి రావాల్సిందేనని ఐసీసీకి సూచించింది. దీంతో అక్కడి నుంచి కూడా ఒత్తిడి పెరిగింది.