సెయిల్ చైర్మన్‌పై దాడి

  • In Crime
  • August 8, 2019
  • 159 Views
సెయిల్ చైర్మన్‌పై దాడి

ఢిల్లీ : స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌదరిపై కొందరు దాడి చేశారు. బుధవారం రాత్రి ఆయన ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండగా ఆయన కారును మరో కారు ఢీ కొంది. దీనిపై ఆయనతో పాటు డ్రైవర్‌ ఢీ కొన్న కారులోని వారిని ప్రశ్నించారు. దీంతో ఆ కారులో ఉన్న నలుగురు యువకులు రెచ్చిపోయి దాడి చేశారు. ఓ వ్యక్తి డ్రైవర్‌ను పట్టుకోగా మిగిలిన ముగ్గురు అనిల్‌ తల, మెడ, కాళ్లపై ఇనుప రాడ్లతో కొట్టారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న పెట్రోలింగ్‌ పోలీసులు ఆయనను రక్షించి ఎయిమ్స్‌కు తరలించారు. యువకులను అరెస్టు చేశారు. చికిత్స అనంతరం చౌదరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, ఎవరో కావాలనే చైర్మన్‌పై దాడి చేసి ఉంటారని కంపెనీ ప్రతినిధి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos