కృష్ణాజిల్లా తెలుగుదేశం కీలకనేత,విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి ట్విట్టర్లో రెచ్చిపోయారు.కొద్ది రోజుల క్రితం నాని-బుద్దా వెంకన్నల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్‌లోకి వైసీపీ నేత పొట్లూరు వరప్రసాద్ అలియాస్ పీవీపీ ఎంటర్ కావడంతో అప్పటి నుంచి నాని-పీవీపీ మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం జరుగుతోంది.ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు,ఆరోపణలు శృతి మించడంతో ప్రజలు సైతం ఇద్దరు నేతలపై అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాని మరోసారి పరోక్షంగా పీవీపీ గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పోస్ట్ చేశారు.మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడని.. వేలాది కోట్లను తిరిగి చెల్లించిన అనంతరం ఇతరులకు శ్రీరంగ నీతులు చెప్పమని సూచించాలంటూ పేర్కొన్నారు. ‘‘అయ్యా జగన్ రెడ్డి గారు బ్యాంకుల పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన.. వేలాది కోట్లను తిరిగి చెల్లించిన తర్వాత శ్రీరంగ నీతులు చెప్పమనండి. లేకపోతే నిమ్మగడ్డకు పట్టిన గతే పడుతుంది’’ అని ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.నాని ట్వీట్‌కు పీవీపీ ఎలా స్పందిస్తాడో చూడాలి..
అయ్యా జగన్ రెడ్డి గారు అసలే బ్యాంకుల పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన వేలాది కోట్లను తిరిగి చెల్లించిన తరువాత శ్రీరంగ నీతులు చెప్పమనండి
లేకపోతే నిమ్మగడ్డ కు పట్టిన గతే పడుతుంది.@ysjagan#andhra#vijayawada pic.twitter.com/X4nxvgESaH— Kesineni Nani (@kesineni_nani) August 2, 2019