అమరావతి: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నక్యాంటీన్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. రోజులాగే అహారానికి ప్రజలు గురువారం ఖాళీ చేతులతో వెనుదిరిగారు. వివిధ జిల్లాల్లోని అన్నక్యాంటీన్లకు తెలుపు రంగు వేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఆహార వితరణ ఆపాలని అక్షయ పాత్ర ఫౌండేషన్ను ప్రభుత్వం సూచించింది. త్వరలో పేరు మార్పుతో క్యాంటీన్లు తిరిగి తెరచుకోనున్నాయని తెలిసింది.