ముప్పుందన్నా పట్టని పాలకులు

ముప్పుందన్నా పట్టని పాలకులు

న్యూ ఢిల్లీ: ప్రాణాలకు ముప్పు ఉందని ఊహింహిచిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తరపు న్యాయవాది మహేంద్ర సింగ్కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తుఫాకి లైసెన్సు అనుమతి నిరాకరించటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదం జరగడానికి వారం రోజుల ముందే-జూలై 15న తుపాకీ లైసెన్స్ కోసం ఉన్నావ్ జిల్లా కలెక్టర్కు ఆయన లేఖ రాసారు. భవిష్యత్తులో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున తనకు తక్షణమే తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు. గత సెప్టెంబర్లో కూడా ఆయన తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసారు. పోలీసులు, జిల్లా యంత్రాంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తన దరఖాస్తును తిరస్కరించేలా చేసిందని ఆరోపించారు. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు మహేంద్ర సింగ్ కూడా తీవ్రంగా గాయ పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos