ఆనందంలో అపశృతి

  • In Sports
  • August 1, 2019
  • 202 Views

 

 

కొలంబో : బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన శ్రీలంక జట్టులో చిన్న అపశృతి చోటు చేసుకుంది. సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆనందంలో శ్రీలంక ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు. కుశాల్‌ మెండిస్‌ బైక్‌పై సహచరుడిని ఎక్కించుకుని  స్టేడియమంతా చక్కర్లు కొట్టాడు. ఆ సమయంలో బైక్‌ అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరూ గాయపడ్డారు. పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, జట్టు సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బైక్‌ను పైకి లేపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos