మియామి : వెస్టిండీస్ తో సిరీస్ లో భాగంగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మతో కలసి ఫ్లోరిడాలోని మియామిలో సరదాగా గడుపుతున్నాడు. వారు రెస్టారెంట్లలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విండీస్ తో నెల రోజుల టూర్లో భాగంగా మియామిలో తొలి రెండు టీ20లు ఆడాల్సి ఉంది. ప్రపంచకప్ సమయంలోనూ విరాట్ కోహ్లీ జంట లండన్ లో చక్కర్లు కొట్టింది. అప్పుడు కూడా అభిమానులు వారి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారు. కాగా విండీస్ పర్యటనకు దూరమైన ధోనీ స్థానంలో రిషభ్ పంత్ జట్టులో చేరాడు.