వైపిపి లోకి ఎన్టీఆర్ కుమార్తె

వైపిపి లోకి ఎన్టీఆర్ కుమార్తె

వైసిపి లో నంద‌మూరి వార‌సురాలి ఎంట్రీ. వైసిపి నుండి పోటీ చేసేందుకు ఆస‌క్తి. ఇప్ప‌టికే కుమారుడి సీటు కోసం మంత నాలు. అసెంబ్లీ సీటు పై స్ప‌ష్ట‌త‌. ఎంపి సీటు పైనే పీట‌ముడి. జ‌గ‌న్ సూచిస్తోంది ఓ స్థానం..ఆ నేత కోరుకుంటోంది మ‌రో స్థానం. అయితే, ఇప్పుడు నేరుగా ఎన్టీఆర్ కుమార్తె వైసిపి లో చేర‌టం ఆ పార్టీకి నైతికంగా బ‌లాన్నిచ్చే అంశం కావ‌టంతో దీని పై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఇదే స‌మ‌యంలో వారి ప్ర‌భావం పార్టీకి రాజ‌కీయంగా ఎంత మేర లాభం చేకూరు స్తుంద‌నే అంశం పై విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి..
వైసిపి లోకి ఎన్టీఆర్ కుమార్తె కుటుంబం..!
ఎన్టీ రామారావు కుమార్తె..కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి వైసిపి లోకి ఎంట్రీ ఖాయ‌మైంది. కొంత కాలంగా దీని పై రాజ‌కీయంగా ప్ర‌చారం జ‌రుగుతున్నా..జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు స‌మ‌యంలో దీని పై ఓ హామీ.. స్ప‌ష్ట‌త వ‌చ్చాయి. పురంధేశ్వ‌రి ప్ర‌స్తుతం బిజెపి లో ఉన్నారు. అంత‌కు ముందు యుపిఏ హయాంలో కేంద్ర మంత్రిగా ప‌ని చేసారు. 2014 లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసారు. ఆ త‌రువాత బిజెపి లో చేరారు. అయితే, ప్ర‌స్తుతం ఏపి లో బిజెపి ప‌రిస్థితి అంతంత‌మాత్రంగా ఉంది. ప్ర‌జ‌లు బిజెపి మీద ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక‌, టిడిపి లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి లో ద‌గ్గుబాటి కుటుంబం ఉంది. ఈ ప‌రిస్థితుల్లో వైసిపి లోకి వెళ్ల‌టం మంచిద‌నే భావ‌న‌లో ద‌గ్గుబాటి కుటుంబం ఉంది. దీనికి అనుగుణంగానే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసారు ద‌గ్గుబాటి దంపతులు. ఎన్టీఆర్ కుమార్తెగా..ఉన్న‌త విద్యా వంతురాలు గా పురంధేశ్వ‌రి కి గుర్తింపు ఉంది. దీంతో..ద‌గ్గుబాటి కుటుంబం వైసిపి లో చేరేం దుకు ఆస‌క్తి చూప‌టంతో వైసిపి అధినేత సైతం వెంట‌నే ఆమోద ముద్ర వేసారు.
ఎన్టీఆర్ కు గౌర‌వం..వైయ‌స్ తో సాన్నిహిత్యం..
ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వ‌రి కుటుంబం వైసిపి లో చేర‌టం ద్వారా..టిడిపికి ప్ర‌ధానంగా మ‌ద్ద‌తిచ్చే ఓ సామాజిక వర్గ ఆలోచ‌న‌ల్లో కొంత మేర మార్పు వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే వైసిపి నేత‌లు ఎన్టీఆర్ గౌర‌వాన్ని ఎక్క‌డా త‌గ్గించ‌కుండా..చంద్ర‌బాబును మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో భాగంగా.. మ‌చి లీప‌ట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో నంద‌మూరి హ‌రికృష్ణ సైతం జ‌గ‌న్ ప్ర‌క‌ట న‌ను అభినందించారు. ఆ త‌రువాత హ‌రికృష్ణ మ‌ర‌ణం స‌మ‌యంలోనూ జ‌గ‌న్ ఆయ‌న కుటుంబానికి సానుభూతి వ్య‌క్తం చేసారు. ఇక‌, చంద్ర‌బాబు ప‌ద‌వి కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ ప‌దే ప‌దే బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేసేవారు. ఇప్పుడు, చంద్ర‌బాబు కు వ్య‌తిరేకంగా ఎన్టీఆర్ కు అనుకూలంగా ఉన్న వారిని ఆక‌ర్షించే ప్ర‌య త్నాలు మొద‌లు పెట్టింది. ఇక‌, నంద‌మూరి కుటుంబ స‌భ్యులే వైసిసి లో చేరితే..అన్ని ర‌కాలుగా మేలు జ‌రుగుతుంద ని వైసిపి నేత‌లు అంచ‌నా కు వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో ద‌గ్గుబాటి దంప‌తుల‌కు వైయ‌స్ తో ఉన్న సన్నిహిత సం బంధాలు సైతం ఇప్పుడు జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరటానికి స‌హ‌కరిస్తున్నాయి.

అసెంబ్లీ సీటు ఓకే..లోక్‌స‌భ సీటు పైనే..
ద‌గ్గుబాటి కుటుంబం వైసిపి లో చేర‌టం లాంచ‌నమే. ఇప్ప‌టికే అన్ని ర‌కాలుగా చ‌ర్చ‌లు ముగిసాయి. ద‌గ్గుబాటి కుమా రుడు హితేష్ కు ప‌ర్చూరు సీటు ఇవ్వాల‌ని ద‌గ్గుబాటి కోరుతున్నారు. అయితే, ఇప్ప‌టికే వైసిపి అక్క‌డ పార్టీ సమ‌న్వ య క‌ర్త‌ను ప్ర‌క‌టించింది. ఇప్పుడు ద‌గ్గుబాటి కుటుంబానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే ఉద్దేశంతో..అక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌త‌తో జ‌గ‌న్ మాట్లాడే అవ‌కాశం ఉంది. ప‌ర్చూరులో త‌మ కుమారుడు పోటీ చేస్తే ఎలా ఉంటుంద‌నే అంశం పై ద‌గ్గుబాటి వేంక‌టేశ్వ‌ర‌రావు ఇప్ప‌టికే స‌ర్వే సైతం నిర్వ‌హించారు. వైసిపి నుండి పోటీ చేస్తే సానుకూల ఫ‌లి తం వ‌స్తుంద‌ని తేల‌టంతో…పార్టీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇక‌, పురంధేశ్వ‌రి పోటీ చేసే లోక్‌స‌భ సీటు పై తర్జ‌న భ‌ర్జ‌న సాగుతోంది. విశాఖ లోక్‌స‌భ నుండి పోటీ చేయాల్సిందిగా జ‌గ‌న్ సూచించారు. అయితే, చిన్న‌మ్మ మాత్రం తన కు గుంటూరు లేదా న‌ర్స‌రావుపేట స్థానం నుండి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. 2009 లో విశాఖ నుండి గెలుపొం దారు. 2014 ఎన్నిక‌ల్లో బిజెపి నుండి రాజంపేట అభ్య‌ర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పురంధేశ్వ‌రి పోటీ చేసే స్థానం గురించి ఒక‌టి రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త రానుంది. ఈ నెల 21న ద‌గ్గుబాటి కుటుంబం వైసిపి లో చేర‌టానికి ముమూర్తంగా నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos