సహచరుని చేతిలో కిదాంబి ఓటమి

  • In Sports
  • July 24, 2019
  • 632 Views
సహచరుని చేతిలో కిదాంబి ఓటమి

టోక్యో : భారత అగ్ర శ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. భారత్‌కే చెందిన హెచ్ఎస్. ప్రణయ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఎనిమిదో సీడ్ శ్రీకాంత్‌ను అన్‌సీడ్‌  ప్రణయ్ 13-21, 21-11, 21-20 తేడాతో మట్టి కరిపించాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ ఆధిపత్యం చెలాయించినా, రెండో గేమ్‌లో ప్రణయ్ పుంజుకున్నాడు. నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌లో ఇద్దరూ పోటా పోటీగా తలపడినా ప్రణయ్‌ను విజయలక్ష్మి వరించింది. గాయం నుంచి తిరిగి కోలుకుని బరిలోకి అడుగుపెట్టిన ప్రణయ్ రెండో రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ జెమ్కేతో తలపడనున్నాడు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తలపడిన భారత జోడీ ప్రణవ్-సిక్కిరెడ్డికి చుక్కెదురైంది. చైనా జంట చేతిలో తొలి రెండు గేమ్‌లోనే 11-21, 14-21 తేడాతో ఓటమిపాలయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos