ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో మునిగాయి. సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి37,847 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు నష్ట పోయి 11,268 వద్ద ఆగాయి. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశా పూరితంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ కార్ప్, టాటాస్టీల్ షేర్లు భారీగా నష్ట పోయాయి. ఏశియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హిందూస్థాన్ యూనీలీవర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 5శాతం పెరిగి 52 వారాల అత్యధికానికి చేరాయి. గత రెండు రోజుల్లో ఈ షేర్లు దాదాపు తొమ్మిది శాతం లాభపడింది. కంపెనీ లాభాల్లో 47శాతం వృద్ధి నమోదు కావడంతో ఈ షేర్ల కొనుగోళ్లు వేగాన్ని పుంజుకు న్నాయి.