పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందని..

పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందని..

 ఎంతో ముద్దుగా,ప్రేమతో పెంచుకున్న కుక్క పక్కింటి కుక్కతో జత కట్టిందనే కారణంగా కుక్కను ఇంటి నుంచి వెలేసిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది.తన పెంపుడు కుక్క పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ లేఖ రాసి మరీ కుక్కను వీధిలో వదిలేశాడు కుక్క యజమాని అందుకు సంబంధించిన లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.తిరువనంతపురంలోని మార్కెట్‌లో గాయాలతో అరుస్తున్న కుక్కను గమనించిన స్థానికులు కుక్కను దగ్గరకు తీసుకొని పరిశీలించగా కుక్క మెడలో ఓ లేఖ కనిపించింది. లేఖలో ఏముందోనని పరిశీలించగా అందులో ఓ వ్యక్తి ఈ విధంగా రాసి ఉంచాడు.‘ఇదో ఉత్తమమైన కుక్క. ఎటువంటి రోగాలు లేకుండా చాలా చక్కగా ఉండేది.ఐదు రోజులకు ఒకసారి స్నానం చేయిస్తుండగా కేవలం బిస్కట్లు,పాలు మాత్రమే ఆహారంగా తీసుకునేది.ఈ కుక్కకు మొరగడమే కానీ కరిచే అలవాటు లేదు. మూడేళ్లలో ఒక్కరినీ కూడా గాయపరచినట్లు ఫిర్యాదులు లేవు.ఇంత ప్రేమగా పెంచుకుంటున్నా ఈ కుక్క పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుంది.అందుకే ఈ కుక్కను వదిలేశాను’అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఇది గమనించిన శ్రీదేవి అనే జంతు ప్రేమికురాలు కుక్కతో పాటు లేఖను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది..

Posted by Sreedevi S Kartha on Sunday, July 21, 2019

తాజా సమాచారం

Latest Posts

Featured Videos