చూడముచ్చటైన ‘జోడీ’

  • In Film
  • July 24, 2019
  • 162 Views
చూడముచ్చటైన ‘జోడీ’

 అప్పుడెప్పుడో కెరీర్‌ ఆరంభంలో ప్రేమకావాలి చిత్రంతో హిట్టు కొట్టిన డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌ తనయుడు ఆది సాయికుమార్‌ అప్పటి నుంచి దాదాపుగా తొమ్మిదేళ్లుగా ఒక్క హిట్టు కోసం చేయని ప్రయత్నాలు లేవు.మాస్‌,క్లాస్‌,లవ్‌ ఇలా ఎన్నిచిత్రాలు చేసినా విజయం మాత్రం దక్కడం లేదు.అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ఆది తన ప్రయత్నాలు కొనసాగిస్తూను ఉన్నాడు.కొద్ది రోజుల క్రితం బుర్రకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది ఆ చిత్రం ఫ్లాప్‌ కావండంతో తదుపరి చిత్రం జోడీని లైన్‌లో పెట్టాడు.చాలా రోజుల క్రితమే మొదలైన జోడీ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం టీజర్‌ విడుదల చేసింది.ఈ చిత్రంలో ఆదికి జోడీగా జెర్సీ ఫేమ్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ జోడీగా నటించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos