గ్యాంగ్‌లీడర్‌ టీజర్‌టాక్‌ ..

  • In Film
  • July 24, 2019
  • 123 Views
గ్యాంగ్‌లీడర్‌ టీజర్‌టాక్‌ ..

 కెరీర్‌ ఆరంభం నుంచి ప్రయోగాలకే ప్రాధాన్యత ఇస్తూ విభిన్న సినిమాల్లో నటించి స్టార్‌ హీరో స్థాయికి ఎదిగిన నేచురల్‌ స్టార్‌ నాని మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ ఏడాది జెర్సీ చిత్రంతో విజయాన్ని అందుకున్న నాని త్వరలో గ్యాంగ్‌లీడర్‌ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.ఈ క్రమంలో బుధవారం గ్యాంగ్‌లీడర్‌ చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ లో కాన్సెప్ట్ ని క్లియర్ గా చూపించేశారు. కామెడీ టైమింగ్ తో పాటు పాత్రల మధ్య సహజంగా అనిపిస్తున్న సంభాషణలు బాగా పేలాయి. బేబీలో మురిపించిన సీనియర్ నటి లక్ష్మి గారితో పాటు శరణ్య కూడా లీడ్ రోల్స్ చేయడం గమనార్హం. ఆడాళ్ళ మధ్య కామెడీకి నలిగిపోయే పాత్రలో నాని చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. హీరొయిన్ ప్రియాంకా ఆరుళ్ మోహన్ క్యుట్ లుక్స్ తో ఆకట్టుకుంది.కానీ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్న ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయను బ్యాక్ షాట్ లో తప్ప పూర్తిగా రివీల్ చేయలేదు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos