ఇప్పుడంటే ప్రేక్షకుల తీరు మారడంతో చిత్ర పరిశ్రమలోకి అలనాటి హీరోహీరోయిన్ల వారసులు అడుగుపెడుతున్నారు కానీ రెండు మూడు దశాబ్దాల క్రితం హీరోల వారసులు ముఖ్యంగా కూతళ్లు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలంటే చాలా కష్టతరంగా ఉండేది.హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సదరు స్టార్ హీరోల అభిమానులు అస్సలు అంగీకరించేవాళ్లు కాదు.ఇదే అనుభవం ఒకప్పటి స్టార్ హీరో కృష్ణ తనయురాలు మంజుళకు కూడా ఎదురైందట.ఓ ఇంటర్‌వ్యూలో మంజుళ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.90వ దశకంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన టాప్‌హీరో చిత్రంలో ముందుగా కృష్ణ తనయురాలు మంజుళను హీరోయిన్‌గా అనుకున్నారట.ఈ విషయం తెలుసుకున్న కృష్ణ అభిమానులు ముసుగులు ధరించి చేతిలో పెట్రోల్ క్యాన్‌లతో స్టూడియోకు వచ్చి మంజుళను హీరోయిన్‌ను చేస్తే పెట్రోల్‌తో తగలబెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారట.దీంతో తనను అభిమానులు ఎంతలా అభిమానిస్తున్నారో స్పష్టమైందని అభిమానులు తనను తమ చెల్లెలిగా భావించి ఇలా చేశారని అర్థమై హీరోయిన్ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు.హీరోయిన్‌గా నటించికపోయినా మంజుళ అప్పుడప్పుడు పలు చిత్రాల్లో నటించారు..