స్వయంకృతాపరధాలే కూల్చేశాయా?

స్వయంకృతాపరధాలే కూల్చేశాయా?

 కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించుకుంది.గత ఏడాది జరిగిన విధానసభ ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్ల తేడాతో అధికారాన్ని కోల్పోవడంతో బీజేపీ నేతలు దాదాపు 14 నెలలు ప్రతిపక్షంలో కూర్చున్నారు.అయితే కాంగ్రెస్‌-జేడీఎస్‌లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏఒక్క రోజు కూడా పాలన సవ్యంగా జరగలేదని చెప్పుకోవాలి.తరచూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు గొడవలు, మనస్పర్థలు, అలకపాన్పులతో ప్రతిరోజూ సంకీర్ణ ప్రభుత్వం నేతలను బుజ్జగించడానికే సమయం వెచ్చించాల్సి వచ్చింది.ఏదైనా అనుమానం కలిగితే ఎమ్మెల్యేలను వెంటనే రెసార్ట్‌లకు తరలించడం వారికి కాపలాగా ఉండడం మినహా ఈ 14 నెలల్లో సంకీర్ణ ప్రభుత్వం చేసిందేమి లేదంటూ విమర్శలు ఉన్నాయి.పైగా ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్‌ జీరో ట్రాఫిక్‌ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం,సీఎం కుమారస్వామి సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ ప్రతీ శాఖలోనూ జోక్యం చేసుకుంటుండడంతో ప్రభుత్వంపై అటు ప్రజల్లో ఇటు ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తమైంది.అన్నికంటే ముఖ్యంగా ప్రభుత్వంలో దేవేగౌడ కుటుంబం అధిపత్యాన్ని అటు కాంగ్రెస్‌ ఇటు జేడీఎస్‌ పార్టీల్లో చాలా మంది సహించలేకపోయారు.పాలనతో పాటు నియోజకవర్గాల వ్యవహరాల్లో కూడా దేవేగౌడ కుటుంబం జోక్యం మితిమీరిందని దీంతోపాటు వరుసగా ఆరేడు సార్లు గెలిచిన తమను కాదని ఒకట్రెండు సార్లకే ఎమ్మెల్యలైన నేతలకు మంత్రి పదవులు ఇవ్వడడంతో జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు అసహనంతో మరింత రగిలిపోయారు.ఈ నేపథ్యంలో 16 మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఒక బీఎస్పీ ఎమ్మెలల్యే సైతం సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.దీంతో మైనారిటీలో పడిపోయిన సంకీర్ణ ప్రభుత్వం విధానసౌధలో బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది.అయితే ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేకపోవడంతో మూడు నాలుగు రోజులు బలపరీక్షను సాగదీస్తూ రెబల్‌ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.అయితే రెబల్‌ ఎమ్మెల్యేలు ఒకేతాటిపై ఉండడంతో మంగళవారం నిర్వహించిన బలపరీక్షలో్ అధికారం నుంచి దిగిపోక తప్పలేదు.దీంతో 14 నెలలుగా అధికారం కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఎట్టకేలకు 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు చేసుకుంటున్నారు.బలపరీక్షలో సంకీర్ణ కుప్పకూలడంతో యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రానున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు యడ్డీ దిల్లీ బయల్దేరి వెళ్లారుఅధిష్ఠానం ఆదేశిస్తే  రోజే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భాజపాకు స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటుకు జాప్యం చేయకూడదని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. బల పరీక్ష వరకు భాజపా నేతలందరూ ఏకతాటి మీద ఉన్నప్పటికీ అంతర్గతంగా కుమ్ములాటలున్నాయి. నేపథ్యంలో  ఎంత వీలైతే అంత త్వరగా అధికార కుర్చీలో కూర్చోవాలని కమలనాథులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్నయితే గద్దె దించారు గానీ..ఇప్పుడు స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో భాజపా నేతలకు భయం పట్టుకుంది. బల పరీక్షకు ముందుఆపరేషన్రివర్స్‌’కు సిద్ధమైనట్లు కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. అసలే ప్రభుత్వాన్ని కోల్పోయిన బాధలో ఉన్న కుమార ఆపరేషన్రివర్స్ను అమలు చేసినా ఆశ్యర్యపోనవరం లేదు. మరోవైపు బెంగళూరు నగర శివార్లలోని రమడా రిసార్టులో మంగళవారం రాత్రి నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలంతా భాజపా శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్ప పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. ఆయన ఒక్కరే ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ  స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం ప్రధాని మోదీ, అమిత్షా, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తాము గవర్నర్ను కలుస్తామని యడ్యూరప్ప తెలిపారు. ఇదిలా ఉండగా రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ ఉందన్న వాదనలు బలంగా వినిపించాయి. అధికారం కోసం కమలదళం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలోని ముంబైకి రెబెల్ ఎమ్మెల్యేలను పంపి కుమారస్వామి ప్రభుత్వ పతనానికి కారణమైందని కాంగ్రెస్, జేడీఎస్లు విమర్శించాయి.ప్రభుత్వం కూలిపోయిన అనంతరంత ఇటువంటి ఆరోపణలు సహజమే.ఏదేమైనా కర్ణాటక మళ్లీ బీజేపీ వశమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos