నామినేషన్‌ పనులు, పదవులపై రిజర్వేషన్లు

నామినేషన్‌ పనులు, పదవులపై రిజర్వేషన్లు

అమరావతి : ప్రభుత్వం నామినేషన్‌పై కేటాయించే పనులు, నామినేటెడ్‌ పదవుల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉద్దేశించిన బిల్లులను శాసన సభ మంగళవారం ఆమోదించింది. వీటితో పాటే శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఈ బిల్లులపై అధికార పార్టీ సభ్యులు చర్చించారు. అనంతరం బిల్లులకు ఆమోదం లభించింది. రిజర్వేషన్ బిల్లు ప్రకారం నామినేటెడ్ ప్రాతిపదికన భర్తీ చేసే వాటిలో మహిళలకే సగం పదవులు దక్కనున్నాయి. ప్రభుత్వ పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 50 శాతం పనులు దక్కనున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో బీసీ కమిషన్ కూడా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు కానుంది. ఈ బిల్లులు శాసన మండలిలోనూ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనున్నాయి. మరోవైపు చంద్రయాన్ -2 ప్రయోగం తొలి దశ విజయవంతం కావడంపై శాసన సభ హర్షం వ్యక్తం చేసింది. ఉప సభాపతి కోన రఘుపతి సభలో ఈ అంశాన్ని ప్రస్తావించగా సీఎం జగన్ సహా సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో తమ హర్షాన్ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos