తొలి స్థానంలో కొనసాగుతున్న ఇండియా

  • In Sports
  • July 23, 2019
  • 175 Views
తొలి స్థానంలో కొనసాగుతున్న ఇండియా

దుబాయ్‌ : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 922 పాయింట్లతో బ్యాటింగ్ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచాడు. కివీస్ సారథి కేన్‌ విలియమ్సన్‌ (913) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఛతేశ్వర్ పుజారా (881) మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ (857) తొలి ర్యాంకుకు ఎగబాకాలని పట్టుదలతో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా (6వ ర్యాంకు), రవిచంద్రన్ అశ్విన్ (10) మాత్రమే టాప్ 10లో ఉన్నారు. ప్యాట్ కమిన్స్, జిమ్మీ అండర్సన్, కాగిసో రబాడ వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos