కమలం గూటికి తెరాస మాజీ నేత..

కమలం గూటికి తెరాస మాజీ నేత..

 తెరాస అధినేత కేసీఆర్‌కు షాకివ్వడానికి మాజీ ఎంపీ వివేక్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.కొద్ది రోజులుగా బీజేపీలో చేరడానికి వివేక్‌ ఆసక్తి చూపుతున్నారని అందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.అమిత్‌షాతో చర్చలు సఫలీకృతమయ్యాయని ఈరోజు సాయంత్రం లోపు వేక్‌ బీజేపీలో చేరడం తథ్యమని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే వివేక్ ఢిల్లీ చేరుకున్న అమిత్‌షా సమక్షంలోనే కమలం గూటికి చేరనున్నారన వార్తలు వినిపిస్తున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో కరీంగనగర్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ వివేక్‌ కొద్ది కాలంగా తెరాసకు దూరంగా ఉంటున్నారు.కరీంనగర్‌ టికెట్‌ తనకు కాకుండా ఇతరులకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన వివేక్‌ తెరాస పార్టీకి కూడా రాజీనామా చేయగా తెలంగాణలో బలపడడానికి చిన్నచిన్న అవకాశాలను కూడా వదులుకోని బీజేపీ వెంటనే రంగంలోకి దిగి వివేక్‌తో చర్చలు మొదలు పెట్టింది.బీజేపీతో చర్చలు ఫలించడంతో ఈరోజు సాయంత్రం బీజేపీలో చేరడానికి వివేక్‌ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం..

 

తాజా సమాచారం