ఈడీ ఎదుట గాలి జనార్దన రెడ్డి

ఈడీ ఎదుట గాలి జనార్దన రెడ్డి

హైదరాబాద్ : కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి సోమవారం ఇక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆయనను బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి జనార్దనరెడ్డిని పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. విదేశాలకు తరలించిన నగదుపై వివరణ కోరారు. ఇనుప ఖనిజం తవ్వకంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డిపై 2007లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు జనార్దన్ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos