అవతార్‌ రికార్డు అధిగమించనున్న అవెంజర్స్‌..

  • In Film
  • July 22, 2019
  • 143 Views
అవతార్‌ రికార్డు అధిగమించనున్న అవెంజర్స్‌..

 పదేళ్లపాటు భద్రంగా ఉన్న అవతార్‌ రికార్డులు ఎట్టకేలకు బద్దలు కానున్నాయి.2009లో జేమ్స్‌ కెమెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన అవతార్‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.19,210 కోట్లు వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.అప్పటి నుంచి ఎన్నో చిత్రాలు అవతార్‌ రికార్డు అధిగమించడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి.ఈ తరుణంలో కొద్ది రోజుల క్రితం విడుదలైన అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ చిత్రం మరికొద్ది రోజుల్లో బద్దలు కొట్టనుంది.అవతార్‌ వసూళ్లు అధిగమించడానికి అవెంజర్స్‌ చిత్రం కేవలం రూ.3.78 కోట్ల మాత్రమే సాధించాల్సి ఉండడంతో రెండు మూడు రోజుల్లో అవతార్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తమ సినిమాకు ఇంతటి ఘన విజయం అందించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవెంజర్స్ అభిమానులకు కెవిన్ ఫీజ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.అయితే త్వరలో జేమ్స్ కామెరూన్ అవతార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17, 2021లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అవెంజర్స్- ది ఎండ్ గేమ్’ మూవీ రికార్డ్ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని అంటున్నారు. ఈ మూవీ ఈజీగా అవెంజర్స్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos